గ్యారేజీ తరలింపునకు చర్యలు
ABN , First Publish Date - 2020-12-08T05:08:36+05:30 IST
పులివెందులలో ఆర్టీసీ గ్యారేజీకి కేటాయించిన స్థలానికి వీలైనంత త్వరగా తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీఎ్‌సఆర్టీసీ ఈడీ ఆదాంసాహెబ్ తెలిపారు.

ఏపీఎ్‌సఆర్టీసీ ఈడీ ఆదాం సాహెబ్
పులివెందుల రూరల్, డిసెంబరు 7: పులివెందులలో ఆర్టీసీ గ్యారేజీకి కేటాయించిన స్థలానికి వీలైనంత త్వరగా తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీఎ్‌సఆర్టీసీ ఈడీ ఆదాంసాహెబ్ తెలిపారు. సోమవారం పులివెందుల ఆర్టీసీ బస్టాండ్, గ్యారేజీలను తనిఖీ చేసిన అనంతరం నూతనంగా ఏర్పాటు చేసే స్థలాన్ని, జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. పీడబ్ల్యూడీ కాలనీలోని గ్యారేజీ స్థలాన్ని పరిశీలించి అధికారులతో పలు విషయాలపై చర్చించారు. అక్కడ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన భవనాలను ఆయన పరిశీలించారు. గ్యారేజీ తరలిస్తే ఆ భవనాలను తాత్కాలికంగా వినియోగించుకునేందుకు సాధ్యాసాధ్యాలను అక్కడి అధికారులు, ఆర్టీసీ అధికారులతో చర్చించారు. బస్సుల్లో కొవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఎం రఘురాం, రాయలసీమ జోన్ ఈఈ వెంకటరమణ, అసిస్టెంట్ మేనేజర్ మహేశ్వర్‌రెడ్డి, సీటీఎం కుళాయప్ప, సీఎంఈ భాస్కర్‌రెడ్డి, డీఈ పోతురాజు తదితరులు పాల్గొన్నారు.