ప్రశాంతంగా ఏపీ సెట్
ABN , First Publish Date - 2020-12-21T05:21:44+05:30 IST
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబులిటి టెస్ట్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఎనిమిది కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు.

కడప(వైవీయూ), డిసెంబరు 20: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబులిటి టెస్ట్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఎనిమిది కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు 1968 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 448 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీసెట్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎనిమిది సెంటర్లలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించామని, యూనివర్శిటీ బ్రాంచ్ కన్వీనర్ అబ్జర్వర్ డాక్టర్ గుప్త, ఏపీసెట్ ప్రత్యేక అబ్జర్వర్ రఘునాథరెడ్డి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.