అరాచక పాలనలో ఏపీ నెంబర్‌వన్‌

ABN , First Publish Date - 2020-10-03T21:36:15+05:30 IST

గతంలో అభివృద్ధిలో దేశంలోనే ముందుండే ఆంధ్రప్రదేశ్‌ జగన్‌ సర్కారు 16నెలల అరాచకపాలనలో నెంబర్‌వన్‌గా ఉందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. శుక్రవారం కడపలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మహాత్మాగాంధీ, లాల్‌బహుదూర్‌ శాస్ర్తిల జయంతి సందర్భంగా

అరాచక పాలనలో ఏపీ నెంబర్‌వన్‌

రాష్ట్రపతి పాలన కోసం ప్రజలు ఉద్యమించే రోజులు వచ్చాయి

ఉపాధి హామీ బిల్లులు చెల్లించకుంటే పంచాయతీరాజ్‌, నీటిపారుదల శాఖ కార్యాలయాలకు తాళాలు వేస్తాం

జగన్‌ సర్కారుపై విరుచుకుపడ్డ టీడీపీ నేతలు


కడప (ఆంధ్రజ్యోతి): గతంలో అభివృద్ధిలో దేశంలోనే ముందుండే ఆంధ్రప్రదేశ్‌ జగన్‌ సర్కారు 16నెలల అరాచకపాలనలో నెంబర్‌వన్‌గా ఉందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. శుక్రవారం కడపలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మహాత్మాగాంధీ, లాల్‌బహుదూర్‌ శాస్ర్తిల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు నేతలు నివాళి అర్పించారు. అనంతరం రాజంపేట, కడప పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జులు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, లింగారెడ్డి మీడియాతో మాట్లాడారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌ అప్పుల్లో కూరుకుపోయిందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని గాడిలో పెట్టి 2019 నాటికి దేశంలోనే బలమైన రాష్ట్రంగా నిలిపారన్నారు. అయితే వైసీపీ సర్కారు అరాచక అటవీ పాలనకు తెరలేపి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని మరచి దోచుకోవడమే ధ్యేయంగా పాలన సాగుతోందన్నారు. న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, దళితులు, బడుగులపై దాడితో జగన్‌ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.


రాష్ట్రపతి పాలనకోసం ప్రజలు ఉద్యమించే రోజులు వచ్చాయన్నారు.  రాయచోటిలో ఓ ముస్లిం మహిళ అంగన్వాడీ టీచరుగా పనిచేస్తోందని, ఆ ఉద్యోగాన్ని తొలగిస్తామని వైసీపీ నేతలు బెదిరించడంతో ఆమె తన దీనగాథను సోషల్‌ మీడియాలో  పంచుకుందన్నారు. దీంతో ఆమెపై దేశ ద్రోహ కేసులు నమోదు చేశారంటే పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. 151 సీట్లు వచ్చాయన్న కైపుతో రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందన్నారు. ఉపాధి హామీ బిల్లులు ఇవ్వకుంటే పంచాయతీరాజ్‌, నీటిపారుదల శాఖ కార్యాలయాలకు తాళాలు వేస్తామని హెచ్చరించారు. అనంతరం లింగారెడ్డిని, శ్రీనివాసరెడ్డిని నేతలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు శ్వేతాశ్రీరెడ్డి, నేతలు హరిప్రసాద్‌, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, అమీర్‌బాబు, రాంగోపాల్‌రెడ్డి, పీరయ్య, వెంకటరెడ్డి, యాటగిరి రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T21:36:15+05:30 IST