వేతనాలివ్వాలంటూ ఆందోళన

ABN , First Publish Date - 2020-12-31T05:06:50+05:30 IST

గ్రీన్‌ అంబాసిడర్లకు 18 నెల ల వేతనాలు చెల్లించాలని ఎంపీడీఓ కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన నిర్వహించారు.

వేతనాలివ్వాలంటూ ఆందోళన
ఆందోళన చేస్తున్న ఏఐటీయూసీ నేతలు, గ్రీన్‌ అంబాసిడర్లు

మైదుకూరు, డిసెంబరు 30:  గ్రీన్‌ అంబాసిడర్లకు 18 నెల ల వేతనాలు చెల్లించాలని ఎంపీడీఓ కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన నిర్వహించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, యూనియన్‌ నేత కేసీ బాదుల్లా, కార్యదర్శి ఏవీ శివరాం మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌ కింద గ్రామీణ ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ  వస్తున్న వారికి వేతనాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ మేరకు ఎంపీడీఓ కుళాయమ్మకు వినతి పత్రం అందచేశారు. కార్యక్రమంలో నేతలు శ్రీరాములు, వెంకట సుబ్బయ్య, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-31T05:06:50+05:30 IST