-
-
Home » Andhra Pradesh » Kadapa » Anti Labour
-
కార్మిక వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలి
ABN , First Publish Date - 2020-11-27T06:03:52+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

జమ్మలమడుగు రూరల్, నవంబరు 26: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. దేశ వ్యాప్త కార్మిక సంఘాల పిలుపు మేరకు గురువారం జమ్మలమడుగు పట్టణంలో కార్మిక సంఘ నాయకులు, కార్మికులు ర్యాలీ చేపట్టారు. తుఫాను కారణంగా ఎడతెరపిలేని వర్షం కురుస్తున్నా కార్మికులు ఆ సంఘాల నాయకులు గొడుగులు పట్టుకుని ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి ఆర్డీవో నాగన్నకు, తహసీల్దారు మధుసూదన్‌రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ కార్మికులతో పెట్టుకుం టే ఆ ప్రభుత్వాలు నిలువవన్నారు. సీఐటీయూ నాయకులు సిరివెల్ల లక్ష్మినారాయణ, భాగ్యమ్మ, సీపీఐ నాయకులు రఫి, ప్రసాద్, లోకేష్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్రం
ప్రొద్దుటూరు టౌన్, నవంబరు 26: కార్మిక చట్టాల్లో మార్పులు చేసి కేంద్ర ప్రభుత్వం కార్మికులను కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా మార్చుతోందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, రాష్ట్ర కమిటీ నాయకుడు రామన్నలు విమర్శించారు. గురువారం దేశవ్యాప్త కార్మికుల సమ్మెలో భాగంగా సీఐటీయూ, ఏఐటీయూసీ, వైఎ్‌సఆర్‌టీయూసీ ఆధ్వర్యంలో పాత బస్టాండు నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే, ఎల్‌ఐసీ, బీఎ్‌సఎన్‌ఎల్, తపాలా వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ పరం చేయడం దేశద్రోహమన్నారు. సీపీఐ జిల్లా కమిటీ సభ్యుడు రామయ్య మాట్లాడుతూ లాక్‌డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయినవారికి నెలకు రూ.10 వేలు వేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, పట్టణ కార్యదర్శి విజయకుమార్, కార్మిక సంఘాల నాయకులు పక్కీరయ్య, సాల్మన్, చంటి, కౌసల్య, సువర్ణ, రమణమ్మ, గ్రీన్ అంబాసిడర్ కార్మికులు సుధ, సునీత, ఆటోయూనియన్ కార్యదర్శి రెహమాన్, ఓబులేసు, ఎస్‌ఎ్‌ఫఐ, డీవైఎ్‌ఫఐ నాయకులు మారుతీ, విశ్వనాథ్, యేసోబు, జాఫర్‌సాధిక్ , తదితరులు పాల్గొన్నారు.
మైలవరంలో..
మైలవరం, నవంబరు 26 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని సీఐటీయూ ఏరియా ఉపాధ్యక్షుడు శివనారాయణ ఆరోపించారు. దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం మండల కేంద్రంలోని నాలుగురోడ్ల కూడలి వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కొండయ్య, మునిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
కొండాపురం, నవంబరు 26: కార్మికుల, రైతుల, పింఛనర్ల సమ స్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ, సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల నేతలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తేవాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కరోనాతో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు పదివేలు చెల్లిం చాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మండల సీపీఐ కార్యదర్శి మనోహర్‌బాబు, ఏఐటీయూసీ కార్యదర్శి వెంకటసు బ్బయ్య, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
ముద్దనూరులో..
ముద్దనూరు నవంబరు26:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువస్తున్నాయని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు, సీఐటీయూ మండల నేత జగదీష్‌లు ఆరోపించారు. స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటీకరణ చేయడంలో ప్రభుత్వాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయన్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో విద్యారంగాన్ని పూర్తిగా విచ్చన్నం చేసే దిశగా ఉందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ప్రమిళమ్మ, ప్రభావతి, రెడ్డయ్య, రాజా, ఓబులేసు నవీన్, కిషోర్ పాల్గొన్నారు.