అన్నమయ్య జిల్లాగా రాజంపేట

ABN , First Publish Date - 2020-11-20T05:16:20+05:30 IST

రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించడం జరుగుతుందని ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు.

అన్నమయ్య జిల్లాగా రాజంపేట
పాఠశాల భవనానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తదితరులు

టీటీడీ బోర్డు సభ్యుడు, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి

ఒంటిమిట్ట, నవంబరు19 : రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించడం జరుగుతుందని  ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలలో టీటీడీ ఆధ్వర్యంలో రూ.80లక్షలతో నిర్మిస్తున్న ప్రాథమిక పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. టీటీడీ అభివృద్ధిలో భాగంగా రామాలయానికి పాఠశాలను గతంలో తొలగించడంతో ఆ మొత్తాన్ని టీటీడీ భరిస్తోందన్నారు. అనంతరం మేడా కోదండరామాలయాన్ని దర్శించుకున్నారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాజంపేటను అభివృద్ధి పథంలో నడిపించడమే తన కర్తవ్యమన్నారు. రాజంపేటలో మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయాలని గట్టి ప్రయత్నం చేసినప్పటికీ రాజంపేట పార్లమెంట్‌ పరిధిలో అనేక నియోజకవర్గాలు ఉన్నందున ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి మదనపల్లెలో నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారని, దానికి బదులుగా రాజంపేటను జిల్లాగా ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు. అందుకు గాను ఇప్పటికే అధికారులు ప్రభుత్వ భవనాలను సిద్ధం చేశారన్నారు.ఎంపీడీఓ కృష్ణయ్య, ఎంఈఓ వెంకటసుబ్బయ్య, టీటీడీ డిప్యూ టీ ఈఓ లోకనాధం, ఇన్‌స్పెక్టర్‌ ధనుంజయుడు, అర్చకుడు శ్రావణ్‌కుమార్‌, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-20T05:16:20+05:30 IST