-
-
Home » Andhra Pradesh » Kadapa » Annabhisekham to Kasi Visweswara
-
కాశీవిశ్వేశ్వరుడికి అన్నాభిషేకం
ABN , First Publish Date - 2020-12-31T05:13:46+05:30 IST
ధనుర్మాస ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి (శివం కోటి) సందర్భంగా బుధవారం కడప నగరం మున్సిపల్ గ్రౌండ్ ఆకుల వీధిలోని రాజరాజేశ్వరి ఆలయ ప్రాంగణంలో వెలిసియున్న కాశీవిశ్వేశ్వరస్వామికి వైభవంగా అన్నాభిషేకం, మహాన్యాస రుద్రాభిషేకం, పుష్పాలంకరణ చేశారు.

కడప(సిటీ) డిసెంబరు 30: ధనుర్మాస ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి (శివం కోటి) సందర్భంగా బుధవారం కడప నగరం మున్సిపల్ గ్రౌండ్ ఆకుల వీధిలోని రాజరాజేశ్వరి ఆలయ ప్రాంగణంలో వెలిసియున్న కాశీవిశ్వేశ్వరస్వామికి వైభవంగా అన్నాభిషేకం, మహాన్యాస రుద్రాభిషేకం, పుష్పాలంకరణ చేశారు. ఆలయ ఈవో ఎ.శ్రీధర్ పర్యవేక్షణలో ప్రధానార్చకులు గోపాలక్రిష్ణ, మురళీక్రిష్ణలు పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులకు అన్న ప్రసాదం అందించారు. కాగా దేవునికడపలోని సోమేశ్వరస్వామి ఆలయ హుండీని ఏవో శ్రీధర్, చైర్మన్ పద్మాకర్‌ల సమక్షంలో బుధవారం లెక్కించారు. సెప్టెంబరు 9 నుంచి డిసెంబరు 30 వరకు రూ.76,414 ఆదాయం వచ్చింది. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆలయంలో స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించి అనంతరం స్వామివారిని మాఢవీధుల్లో ఊరేగించారు.