అంబేడ్కర్‌కు పలువురి నివాళి

ABN , First Publish Date - 2020-12-07T04:52:40+05:30 IST

రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ 64వ వర్ధంతిని పురష్కరించుకొని ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పలు పార్టీల నాయకులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరై పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

అంబేడ్కర్‌కు పలువురి నివాళి
అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మాజీ మేయర్‌ సురేష్‌బాబు

కడప(మారుతీనగర్‌), డిసెంబరు 6: రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ 64వ వర్ధంతిని పురష్కరించుకొని ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పలు పార్టీల నాయకులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరై పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఇందులో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మాజీ మేయర్‌ సురేష్‌బాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బి.హరిప్రసాద్‌, కడప నియోజక ఇన్‌చార్జి అమీర్‌బాబు, జిల్లా అధికార ప్రతినిధి ఆమూరి బాలదాసు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నీలి శ్రీనివాసులు, తిరుమలేసు, జనసేనపార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌ సుంకర శ్రీనివాస్‌, సంఘ సేవకుడు సయ్యద్‌ సలావుద్దీన్‌, ఆర్‌సీపీ అధ్యక్షుడు నిమ్మకాయల రవిశంకర్‌రెడ్డి, ఏపీ బీసీ మహాసభ జాతీయ కన్వీనర్‌ అవ్వారు మల్లికార్జున, బీసీ సంక్షేమసంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు బంగారునాగయ్య, అధ్యక్షుడు బత్తల లింగమూర్తి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోవిందు నాగరాజు, నాయకులు పులిసునీల్‌కుమార్‌ తదితరులున్నారు. 

దళితమిత్ర సంఘం ఆధ్వర్యంలో..

కడప(నాగరాజుపేట), డిసెంబరు 6: అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా దళితమిత్ర సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కైపు రామాంజనేయులు ఆధ్వర్యంలో ఆదివారం సంఘ కార్యాలయంలో మహానేత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసరి నరసింహులు, ప్రధాన కార్యదర్శి వీరయ్య, కార్యవర్గ సభ్యులు గన్నేపాటి రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, ప్రచార కార్యదర్శి సుబ్బరాయుడు పాల్గొన్నారు.

మాలమహానాడు ఆధ్వర్యంలో..

మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఇండ్లూరు సురేష్‌ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కార్యాలయంలో ఘనంగా అంబేడ్కర్‌ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పుష్పరాజ్‌, అంజన్‌కుమార్‌, ప్రకాష్‌, ప్రభుదాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-07T04:52:40+05:30 IST