అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

ABN , First Publish Date - 2020-12-07T04:29:30+05:30 IST

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అన్నారు.

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి
అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి

పోరుమామిళ్ల, డిసెంబరు 6: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అన్నారు. పోరుమామిళ్లలో అంబేడ్క ర్‌ సర్కిల్‌లో ఉన్న ఆయన విగ్రహానికి వారు ని వాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిత్తా విజయప్రతా్‌పరెడ్డి, బద్వేలు మార్కెట్‌ యా ర్డు వైస్‌ ఛైర్మన కల్లూరి రమణారెడ్డి, వైసీపీ రాష్ట్రకార్యదర్శి నాగార్జునరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్తా రవిప్రకాశరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్‌ నేతలు నివాళులర్పించిన కార్యక్రమాల్లో మానవ హక్కుల పరిరక్షణ సంఘం నాయకులు ముత్యా ల ప్రసాదరావు, ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఓబయ్య, యోహాను, బాలస్వామి, జయరామ్‌, ర మణమూర్తి, నాగదాసరి చెన్నరాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-07T04:29:30+05:30 IST