రేషన్‌తో పాటు రూ.5 వేలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-03-25T09:59:48+05:30 IST

రాష్ట్రంలో 22వ తేది నుంచి కరోనా కర్ఫ్యూ వల్ల సాధారణ ప్రజలు ఉపాధి కోల్పోయారని, వచ్చే నెల 4వ తేదీన ఒక్కో

రేషన్‌తో పాటు రూ.5 వేలు ఇవ్వాలి

కడప (కోటిరెడ్డిసర్కిల్‌), మార్చి 24: రాష్ట్రంలో 22వ తేది నుంచి కరోనా కర్ఫ్యూ వల్ల సాధారణ ప్రజలు ఉపాధి కోల్పోయారని, వచ్చే నెల 4వ తేదీన ఒక్కో కుటుంబానికి రేషన్‌తో పాటు రూ.వెయ్యి ఇస్తామని సీఎం ప్రకటించడం సరైంది కాదని, తక్షణమే పేదలకు గ్రామ వలంటీర్ల ద్వారా రేషన్‌తో పాటు రూ.5 వేలు అందించాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.హరిప్రసాద్‌ అన్నారు. కడప నగరం హరిటవర్స్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో బీసీ సెల్‌ కార్యదర్శి మాసాకోదండరామ్‌, సీనియర్‌ నాయకుడు అమీర్‌బాషలు పాల్గొన్నారు.

Read more