రసాభాసగా ప్లాట్ల కేటాయింపు

ABN , First Publish Date - 2020-07-19T09:15:14+05:30 IST

గండికోట పునరావాసంలో భాగంగా మం డలంలోని తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి చెందిన ప్లాట్ల కేటాయింపు...

రసాభాసగా ప్లాట్ల కేటాయింపు

  • ఆందోళనకు దిగిన తాళ్లప్రొద్దుటూరు నిర్వాసితులు  
  • లాటరీ తీసి వెళ్లిపోయిన అధికారులు 

కొండాపురం, జూలై 18: గండికోట పునరావాసంలో భాగంగా మం డలంలోని తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి చెందిన ప్లాట్ల కేటాయింపు శనివారం రసాభాసగా మారింది. కనీస వసతులు కల్పించకుండా ప్లాట్లు కేటాయించడం ఏమిటని గ్రామానికి చెందిన నిర్వాసితులు ఆందోళనకు దిగారు. అయినా అధికారులు మాత్రం తమ పని తాము చేసుకోపోతామన్నట్లు లాటరీ తీసి వెళ్లిపోయారు. వివరాల్లోకెళితే..  తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి సంబంధించి సుమారు 1100 మంది నిర్వాసితులు పునరావాసంలో భాగంగా ఇళ్లస్థలాలను కోరుకున్నారు. వారికోసం ప్రభుత్వం జోగాపురం గ్రామం వద్ద సుమారు 200ఎకరాలను కేటాయించింది. అంత వరకు బాగున్నా కనీసం రోడ్లు, ప్లాట్లకు సంబంధించి రాళ్లు కూడా వేయకుండానే ప్లాట్ల కేటాయింపుకు అధికారులు సిద్ధమవడంతో పొలాల్లోనే ఇళ్లు ఎలా నిర్మించుకోవాలంటూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. ఒకవైపు అధికారులు ప్లాట్లు డిప్పు తీస్తుండగా మరోవైపు నిర్వాసితులు రోడ్డుపైన ఆందోళన చేశారు. కొండాపురం సీఐ శ్రీరామ్‌శ్రీనివాసులు జోక్యం చేసుకొని ఇటువంటి సమయంలో ఆందోళన చేయడం సమంజసం కాదని ఏదైన సమస్యలుంటే జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలని సూచించడంతో ఆందోళన విరమించారు. ఈ విషయ మై ఆర్డీఓను నాగన్నను వివరణ కోరగా పద్ధ్దతి ప్రకారమే ప్లాట్ల కేటాయింపు జరుగుతోందని ఇప్పటికే 380 ప్లాట్లకు క్లారిటీ వచ్చిందన్నారు. పనులన్నీ వేగంగా పూర్తిచేస్తున్నామని కొందరు కావాలనే అడ్డుకుంటున్నారని ఆర్డీఓ తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూ టీ కలెక్టర్‌ శ్రీనివాసులు, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. 


వెలిగొండ ప్యాకేజీ ఇవ్వాలి

వెలిగొండ నిర్వాసితులు ఇచ్చే ప్యాకేజీని తమకు ఇవ్వాలని మండలంలోని తాళ్లప్రొద్దుటూరు నిర్వాసితులు పులివెందుల్లోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఎంపీ అవినా్‌షరెడ్డిని కలిసి విన్నవించారు. కటాఫ్‌ డేట్‌ను పెంచాలని  విజ్ఞప్తి చేశారు. వాటన్నింటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ హామీ ఇచ్చినట్లు  తెలిపారు.

Updated Date - 2020-07-19T09:15:14+05:30 IST