మోటార్‌సైకిల్‌ ఢీ .. ఒకరికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2020-12-04T05:09:28+05:30 IST

ఎర్రగుంట్ల-వేంపల్లి రోడ్డులో గురువారం ఉదయం మోటార్‌సైకిల్‌ ఢీకొన్న సంఘటనలో రామక్రిష్ణకు తీవ్ర గాయాలయ్యాయి.

మోటార్‌సైకిల్‌ ఢీ .. ఒకరికి తీవ్ర గాయాలు

ఎర్రగుంట్ల, డిసెంబరు 3: ఎర్రగుంట్ల-వేంపల్లి రోడ్డులో గురువారం ఉదయం మోటార్‌సైకిల్‌ ఢీకొన్న సంఘటనలో రామక్రిష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. మొటార్‌సైకిల్‌లో వెళుతున్న రామక్రిష్ణను ఎదురుగా వేగంగా  వచ్చిన మోటార్‌సైకిల్‌ ఢీకొట్టడంతో అతని కాలు విరిగిపోయింది. 108వాహన సిబ్బంది  ప్రథమ చికిత్స చేసి అతనిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కిడి నుంచి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. 

దొంగ అరెస్టు

చోరీ కేసుతో సంబందమున్న దొంగ నల్లంనాగరాజును గురు వారం అరెస్టు చేసినట్లు ఎర్రగుంట సీఐ సదాశివయ్య తెలిపా రు. రాజుపాలెం మండలం కొర్రపాడుకు చెందిన నాగరాజును  గురువారం అరెస్టు చేసి అతని వద్ద చోరీకి సంబందించిన రూ.9500 డబ్బును, ఏపీ 04 ఏబీ 1031 నెంబరు గల మోటార్‌ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-12-04T05:09:28+05:30 IST