లారీని ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం

ABN , First Publish Date - 2020-11-22T05:20:10+05:30 IST

రేణిగుంట-కోడూరు మార్గంలోని మామండూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం తడికెలబైలుకు చెందిన జి.సాయికిరణ్‌ (22) డిగ్రీ సెకండియర్‌ చదువుతున్నాడు.

లారీని ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం
ప్రమాదంలో మృతి చెందిన సాయికిరణ్‌, విజయకుమార్‌

రైల్వేకోడూరు, నవంబరు 21: రేణిగుంట-కోడూరు మార్గంలోని మామండూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం తడికెలబైలుకు చెందిన జి.సాయికిరణ్‌ (22) డిగ్రీ సెకండియర్‌ చదువుతున్నాడు. జి.విజయకుమార్‌ (24) హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేశాడు. వీరిద్దరూ కజిన్స. వీరిద్దరి తల్లిదండ్రులు కువైట్‌లో ఉన్నారు. వీరి మామ శనివారం మిద్దెపై నుంచి కింద పడిపోయాడు. అతడిని తిరుపతిలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడికి సంబంధించిన ఆధార్‌కార్డు, రేషన కార్డులను వీరిద్దరూ తీసుకెళ్లి అతడికి ఇచ్చి శనివారం రాత్రి బయల్దేరారు. మామండూరు సమీపానికి వచ్చేసరికి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ప్రమాదవశాత్తూ ఢీకొని ఇద్దరూ తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న రేణిగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన వారి వద్ద లభించిన ఆధారాలతో కుటుంబీకులు సమాచారం ఇచ్చారు. సీఐ అంజూయాదవ్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ సునీల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read more