గుండాలేరులో యువకుడు గల్లంతు

ABN , First Publish Date - 2020-12-16T05:15:15+05:30 IST

మండలంలోని గుండాలపల్లె సమీ పంలో ఉన్న గుండాలేరులో మంగళవారం ఓ యువకుడు గల్లంతైనట్లు ఎస్‌ఐ-1 పెద్ద ఓబన్న తెలిపారు.

గుండాలేరులో యువకుడు గల్లంతు

రైల్వేకోడూరు రూరల్‌, డిసెంబరు, 15:మండలంలోని గుండాలపల్లె సమీ పంలో ఉన్న గుండాలేరులో మంగళవారం ఓ యువకుడు గల్లంతైనట్లు ఎస్‌ఐ-1 పెద్ద ఓబన్న తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు... గుండాలేరులో ఆరు గురు యువకులు ఈతకు వెళ్లారు. వారిలో ఇద్దరు గల్లంతయ్యారు. గుం డాలపల్లెకు చెందిన రాజా అనే యువకుడిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బం ది స్థానికుల సాయంతో కాపాడారు. అయితే అదే గ్రామానికి చెందిన శివరామక్రిష్ణ అనే యువకుడు గల్లంతయ్యాడు. శివరామక్రిష్ణ కోసం గాలింపు చర్య లు చేపట్టారు. అగ్నిమాపక అధికారి నెల్లారి సుబ్బరాజు ఆధ్వర్యంలో సిబ్బందిని గుం డాలేరులోకి పంపించి గాలింపు చర్యలు చేపట్టారు. శివరామక్రిష్ణ ఆచూకీ ఇంతవరకు కనపించలేదని పోలీసులు తెలిపారు. వెలుతురు లేని కారణంగా గాలింపు చర్యలకు ఆటంకం కలగడంతో ఆపేశామని, బుధవారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు చేపడతామని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

Read more