పొలాలపై మిడతల దండు
ABN , First Publish Date - 2020-08-12T05:30:00+05:30 IST
గుంపులుగా చేరి పశుగ్రాసాన్ని తినేసే మిడతల దండు మైదుకూరు మున్సిపల్ పరిధిలోని యల్లంపల్లె ప్రాంతంలో కన్పించింది. పంటలపై

ఆప్రమత్తమైన అధికారులు
మైదుకూరు రూరల్, ఆగస్టు 12: గుంపులుగా చేరి పశుగ్రాసాన్ని తినేసే మిడతల దండు మైదుకూరు మున్సిపల్ పరిధిలోని యల్లంపల్లె ప్రాంతంలో కన్పించింది. పంటలపై మిడతల దండు దాడిచేస్తోందంటూ కొన్ని నెలల క్రితం తెలంగాణ, అనంతపురం జిల్లాలో రైతులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో మిడతల దండు మంగళవారం మైదుకూరు సమీపంలోని యల్లంపల్లెలో రైతు నాగప్రసాద్రెడ్డి పొలంలో కన్పించింది. దీంతో రైతు ఆందోళన చెంది వ్యవసాయాధికారులకు తెలియజేయడంతో బుధవారం ఏడీఏ క్రిష్ణమూర్తి, ఏవో లక్ష్మి ప్రసన్న, శాస్త్రవేత్తలతో కలసి పొలాన్ని సందర్శించారు.
ఇతర ప్రాంతాల్లో మిడతల దండు కన్పించలేదని వారు తెలిపారు. మిడతల నివారణకు క్లోరిఫైరిఫాస్ లీటరు నీటికి 2.5 మి.లీ కలిపి పిచికారి చేయాలని, 500 మి.లీ డీడీవీపీ 76 ఈసీ 500 మి.లీ నీటిలో 100 కిలోల ఇసుకను కలిపి పైరు మీద ఉదయం 7 నుంచి 10 గంటల్లోపు, సాయంత్రం పూట చల్లాలని రైతులకు సూచించారు.