వైసీపీ, బీజేపీ నాయకుల మధ్య స్వల్ప ఘర్షణ

ABN , First Publish Date - 2020-03-15T10:51:59+05:30 IST

నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయం వద్ద వైసీపీ, బీజేపీ నాయకుల మధ్య స్వల్ప ఘర్షణ

వైసీపీ, బీజేపీ నాయకుల మధ్య స్వల్ప ఘర్షణ

12 మందిపై కేసు నమోదు 


కొండాపురం, మార్చి 14: నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయం వద్ద వైసీపీ, బీజేపీ నాయకుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ఏకగ్రీవాలకు సంబంధించి ఇరువురు నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకుడు రామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 12 మంది బీజేపీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు కొండాపురం ఏఎస్‌ఐ ఉత్తమారెడ్డి తెలిపారు. 


కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం..

వైసీపీ నాయకుల దౌర్జన్యాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని బీజేపీ మండల కన్వీనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. తమపై అక్రమంగా కేసులు బనాయించాలని చూస్తే కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఓటమి భయంతోనే తమపై కేసులుపెడుతున్నారని, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి నేతృత్వంలో ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని మెజార్టీ స్థానాలను సాధిస్తామన్నారు. 

Updated Date - 2020-03-15T10:51:59+05:30 IST