ఖాజీపేట పాలకోవకు భలే గిరాకీ...

ABN , First Publish Date - 2020-03-18T06:05:22+05:30 IST

ఖాజీపేట పాలకోవకు భలే గిరాకీ...

ఖాజీపేట పాలకోవకు భలే గిరాకీ...

 యువతకు చేయూతగా కుటీర పరిశ్రమ


ఖాజీపేట, మార్చి 17:
గువ్వల చెరువు పాలకోవా తెలియని వారుండరు. కొంతకాలానికి సిద్దవటం నుంచి బద్వేలు దారిలో ఒక ప్రాంతంలో కోవా తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇదే తరహాలో ఖాజీపేటలోనూ పలువురు యువకులు పరిశ్రమగా పాలకోవా తయారు చేసి అమ్మకాలు చేస్తున్నారు. రుచిగా వుండడంతో, జాతీయ రహదారిపై ఏర్పాటు చేసి ఉండడంతో ఇతర జిల్లాలకు వ్యాపించింది. ఆ వివరాల్లోకి వెళ్ళితే.. 


ఖాజీపేట పరిసర ప్రాంతాల్లో ఎండు గడ్డి, పచ్చిగడ్డి  పుష్కలంగా దొరుగుతుంది. ఫలితంగా యువత పాడివైపు మొగ్గుచూపడంతో పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందింది. పాలు పుష్కలంగా దొరుకుతుండడంతో రెండు చోట్ల పాలకోవా తయారీ ఏర్పాటు చేశారు. పలువురు యువత కూడా పాలకోవా తయారి వైపు మొగ్గుచూపి కుటీర పరిశ్రమగా మార్పుచేసుకుని ఆరు పాలకోవా యూనిట్లు నడుస్తున్నాయి. దీంతో పలువురు కుటుంబాలకు ఉపాధి కూడా దొరుకుతుంది. 


ఇతర జిల్లాలకు సరఫరా...

సపాలకోవా తయారీ చేసి జాతీయ రహదారిపై వెళ్లే బస్సుల్లో అమ్మకాలు చేయడంతో కోవా రుచి ఇతర జిల్లాలకు వ్యాపించింది. ఖాజీపేట నుంచి కడప, బెంగుళూరు, కర్నూలు, బనగానపల్లె, నంద్యాల తదితర ప్రాంతాలకు పార్శిళ్ల రూపంలో రవాణా జరుగుతోంది. కిలో రూ.200లు, రుచి శుచి వుండడంతో గిరాకీ పెరిగిందని చెప్పవచ్చు.


తక్కువ ధరకే అందిస్తున్నాం...

పాడి రైతుల వద్ద నుండి పాలు కొనుగోలు చేసి వాటి ద్వారా పాలకోవ తయారు చేస్తున్నాం. ఈ పరిశ్రమ వల్ల కొందరికి ఉపాది కల్పించడంతో పాటు పాడిరైతుకు లాభసాటిగా అందిస్తున్నాం. నాణ్యత, రుచి, శుచితో పాటు తక్కువ ధరకే పాల కవ్వ అందిస్తున్నాము.


కొందరికి ఉపాధి కల్పిస్తున్నాం

మా కుటుంబాలతో పాటు ఇతర కుటుంబాలకు ఉపాది కల్పిస్తున్నాం. పాలను సేకరించి వాటి ద్వారా నాణ్యమైన పాలకోవాను తయారు చేయడంతో రుచిగా వుంటుంది. అంతేకాకుండా తక్కువ ధరకు అందిస్తుండడంతో ఇతర జిల్లా వాసులకు సరఫరా జరుగుతుంది.

- యి.వి.బ్రహ్మానందరెడ్డి, ఖాజీపేట


నాణ్యతకు రాజీపడం

మంచి నాణ్యత కల్గిన పాలకోవ్వను తయారు చేస్తుండడంతో ఇతర జిల్లాలకు సరఫరా చేస్తున్నాము. తక్కువ ధరకు ఇవ్వడంతో మంచి గిరాకి వుంది. కూలిపాటు వుండడంతో పది మందికి ఉపాది కల్పిస్తున్నాం.

- బి.బాలయ్య, పత్తూరు


Updated Date - 2020-03-18T06:05:22+05:30 IST