-
-
Home » Andhra Pradesh » Kadapa » a car pass away in river
-
మాండవ్య నదిలో కారు గల్లంతు
ABN , First Publish Date - 2020-11-27T06:56:22+05:30 IST
మాండవ్యనదిలో గురువారం రాత్రి వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది.

ఇద్దరు సురక్షితం.. మరో ఇద్దరు కారులోనే..
చిన్నమండెం, నవంబరు 26 : చిన్నమండెం మండలంలోని మాండవ్యనదిలో గురువారం రాత్రి వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది. ఈ కారులో వస్తున్న వారంతా రాజంపేటకు చెందిన వారు. మండలంలోని కేశాపురం వద్ద రహదారిపైన మాండవ్యనది పారుతోంది. ఈ నీటిలో దిగిన వీరి కారు కొట్టుకుపోయింది. వీరిలో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. కారులోనే ఇద్దరు ఉండిపోయారు. విషయం తెలిసిన వెంటనే రాయచోటి రూరల్ సీఐ లింగప్ప, చిన్నమండెం ఎస్‌ఐ అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.