అన్ని హంగులతో 803 జగనన్న కాలనీలు

ABN , First Publish Date - 2020-12-27T05:31:38+05:30 IST

జిల్లాలో 803 జగనన్న కాలనీలు ఆవిర్భవించనున్నాయని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, కలెక్టర్‌ హరికిరణ్‌లు పేర్కొన్నారు.

అన్ని హంగులతో 803 జగనన్న కాలనీలు
వేంపల్లెలో ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్న ఎంపీ అవినాష్‌రెడ్డి, కలెక్టర్‌ హరికిరణ్‌

వేంపల్లె, డిసెంబరు 26: జిల్లాలో 803 జగనన్న కాలనీలు ఆవిర్భవించనున్నాయని  కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, కలెక్టర్‌ హరికిరణ్‌లు పేర్కొన్నారు. స్థానిక రాజీవ్‌ నగర్‌ కాలనీ లేఅవుట్‌లో శనివారం ఇంటి పట్టాల పంపిణీలో వారు మాట్లాడుతూ  22 ఎకరాల్లో రాజీవ్‌ నగర్‌ కాలనీ లేఅవుట్‌లో  590 ప్లాట్లను పేదలకు పంపిణీ చేశారన్నారు. వేంపల్లె మండల వ్యాప్తంగా దాదాపు 2800 మంది లబ్ధిదారులు ఉండగా ఒక్క వేంపల్లె పట్టణ ప్రాంతంలోనే నాలుగు లేఅవుట్లలో దాదాపు 1900 మంది లబ్ధిదారులున్నారన్నారు. మూడేళ్లలో ఇళ్లను  నిర్మించి ఇచ్చే చర్యలను ప్రభు త్వం వేగవంతం చేస్తోందన్నారు. పట్టణంలో వైఎస్‌ వివేకానందరెడ్డి పేరుతో డిగ్రీ కళాశాల, అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  పట్టణ వాసు లకు రూ.2కోట్లతో ఆహ్లాదకరమైన నూతన పార్కు, రూ93కోట్లతో అండర్‌ డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, డీసీ ఎంఎస్‌ మాజీ అధ్యక్షుడు శంకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, మండల కన్వీ నర్‌ చంద్ర ఓబుళరెడ్డి,  గాయత్రి, ఆర్‌ వేణు, యూత్‌ కన్వీనర్‌ రవిశంక ర్‌ గౌడ్‌, మైనా ర్టీ కన్వీనర్‌ మునీర్‌, తహసీల్దార్‌, ఎంపీడీఓ, ఈఓ ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-27T05:31:38+05:30 IST