ఆర్టీపీపీ నుంచి తెలంగాణకు 72 మంది ఇంజినీర్లు బదిలీ
ABN , First Publish Date - 2020-03-16T10:32:23+05:30 IST
రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు నుంచి తెలంగాణకు 72 మంది ఇంజినీర్లు బదిలీ అయ్యారు. ఇందుకు సంబంధించిన
ఎర్రగుంట్ల, మార్చి15: రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు నుంచి తెలంగాణకు 72 మంది ఇంజినీర్లు బదిలీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఆదివారం ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఆర్టీపీపీ సీఈ సుబ్రమణ్యం ఇచ్చినట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనలో భాగంగా ఏర్పడిన బదిలీల సంక్షోభానికి ఇటీవల తెరపడింది. ఇందులో భాగంగానే ఏపీ నుంచి వెళ్లాల్సిన సుమారు 655 మంది ఇంజినీర్ల బదిలీలు ప్రారంభం అయ్యాయి. ఆర్టీపీపీ నుంచి అన్ని విభాగాలకు చెందిన 72మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చామని సీఈ తెలిపారు.
ఇందులో ఏఈ నుంచి ఎస్‌ఈ క్యాడర్ వరకు ఉన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ విభాగం నుంచి అధికంగా ఈబదిలీలో ఉన్నారు. ఎస్‌ఈ క్యాడర్‌లో కె.రామసుబ్బారెడ్డి ఒకరు మాత్రమే ఉన్నారు. అలాగే తెలంగాణ నుంచి ఆర్టీపీపీకి ఎంత మంది ఇంజినీర్లు వస్తున్నారని అడుగగా ఇంకా తెలియరాలేదన్నారు. అలాగే ఆర్టీపీపీ నుంచి నెల్లూరు, వీటీపీఎస్, ఇతర పవర్‌ప్లాంట్లకు కూడా త్వరలో బదిలీలు జరగనున్నట్లు తెలిసింది. దీంతో ఆర్టీపీపీలో బదిలీల కలకలం ప్రారంభం అయ్యింది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే తిష్టవేసిన ఫెవికాల్ వీరులకు కూడా స్థాన చలనం ఏర్పడింది. ఈ బదిలీలను కొందరు జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. మరి కొందరు కుటుంబాల రీత్యా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. పిల్లల చదువులు, ఆరోగ్యాల పరిస్థితిపై ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.