-
-
Home » Andhra Pradesh » Kadapa » 673 cases registered
-
673 కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-08-20T11:49:08+05:30 IST
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల వేగానికి కళ్లెం పడ్డం లేదు. 24గంటల వ్యవధిలో 673 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య

నలుగురి మృతి
కడప, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల వేగానికి కళ్లెం పడ్డం లేదు. 24గంటల వ్యవధిలో 673 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ప్రకటించింది. దీంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 18,944కు చేరుకుంది. కరోనా బారిన పడ్డ మరో నలుగురు మృతి చెందారు. మృతుల సంఖ్య 199కి చేరుకుంది. కోవిడ్ నుంచి కోలుకుని 14,334 మంది డిశ్చార్జి అయ్యారు. హోం క్వారంటైన్‌లో 3167 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ 2,05,844 మంది నుంచి నమూనాలను సేకరించారు. బుధవారం ఒక్కరోజే 3936 మంది నుంచి శాంపిల్స్ తీశారు.
ఓ విలేకరి మృతి
జిల్లాకు చెందిన ఓ విలేకరి కరోనాతో మృతిచెందారు. నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఈయన రాయచోటిలో చికిత్స పొందారు. ఆరోగ్యం కుదుట పడకపోవడంతో మూడురోజుల క్రితం కుటుంబసభ్యులు తిరుపతికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం అర్ధరాత్రి తర్వాత కన్నుమూశారు.