సర్వీసులోకి 600 మెగావాట్ల యూనిట్
ABN , First Publish Date - 2020-03-02T10:16:53+05:30 IST
ఆర్టీపీపీలోని 600మెగావాట్ల ప్లాంటును 1వతేదీ (ఆదివారం) తెల్లవారుజామున 4గంటలకు లైటప్ చేశారు. అలాగే మధ్యాహ్నం సింక్రోనైజింగ్

రెండు యూనిట్స్ మాత్రమే రన్నింగ్
ఎర్రగుంట్ల, మార్చి1: ఆర్టీపీపీలోని 600మెగావాట్ల ప్లాంటును 1వతేదీ (ఆదివారం) తెల్లవారుజామున 4గంటలకు లైటప్ చేశారు. అలాగే మధ్యాహ్నం సింక్రోనైజింగ్ చేశారు. రాత్రి 9.05గంటల సమయంలో 354మెగావాట్లతో 600మెగావాట్ల యూనిట్ నడుస్తోంది. పదిరోజుల క్రితం ఈప్లాంటును షట్‌డౌన్ చేశారు. అయితే ప్లాంటు ఉత్పత్తి మరింత ముందుకెళ్లకుండా బ్యాక్ చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం ఆర్టీపీపీలో 1650మెగావాట్ల సామర్థ్యం గల ఆరు ప్లాంటు ఉండగా కేవలం 1వ యూనిట్ 210మెగావాట్లకు గాను 151మెగావాట్లతో, ఆరవ యూనిట్ 600మెగావాట్ల సామర్థ్యంకు గాను కేవలం 354మెగావాట్ల సామర్ధ్యంతో రెండు ప్లాంట్లను మాత్రమే నడుపుతున్నారు. మిగతా నాలు గు యూనిట్లను షట్‌డౌన్ చేశారు. ప్లాంటులో సుమారు నాలుగు లక్షల మెట్రిట్ టన్నుల బొగ్గు నిల్వలు కూడా ఉన్నాయి. అయితే 600మెగావాట్ల ప్లాంటు పూర్తి స్థాయి సామర్ధ్యంతో కాకపోయినా బ్యాక్‌డౌన్‌ను సడలిస్తే 500మెగావాట్ల వరకు ఉత్పత్తిని చేసేందుకు ప్లాంటు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.