కూలిన మూడంతస్తుల పాతమిద్దె

ABN , First Publish Date - 2020-12-16T05:10:09+05:30 IST

కడప నగరం రవీంద్రనగర్‌ లోని లా కళాశాల వెనుక మూడంతస్తుల పాత మిద్దె కూలిపోయింది. ఇటీవల బుగ్గవంక వరదలకు అక్కడ ఉన్న పలువురి ఇళ్లల్లోకి నీరు చేరాయి.

కూలిన మూడంతస్తుల పాతమిద్దె
కూలిన పాతమిద్దెను పరిశీలిస్తున్న ఫైర్‌ సిబ్బంది

త్రుటిలో తప్పిన ప్రమాదం

కడప(క్రైం), డిసెంబరు 15: కడప నగరం రవీంద్రనగర్‌ లోని లా కళాశాల వెనుక మూడంతస్తుల పాత మిద్దె కూలిపోయింది. ఇటీవల బుగ్గవంక వరదలకు అక్కడ ఉన్న పలువురి ఇళ్లల్లోకి నీరు చేరాయి. దీంతో స్థానికులు కొంతమంది ఖాళీ చేశారు. అయితే మంగళవారం రాత్రి 11 గంటలకు ఆ పాతమిద్దె ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లీడింగ్‌ ఫైర్‌మెన్‌ వెంకటసుబ్బయ్య ఆఽధ్వర్యంలో కూలిపోయిన మిద్దెను పరిశీలించారు. కాగా మిద్దె వద్ద పార్కింగ్‌ చేసిన స్కూటర్‌, ఆటో స్వల్పంగా దెబ్బతిన్నట్లు ఫైర్‌ సిబ్బంది పేర్కొన్నారు. 

Read more