343 కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-08-22T11:45:17+05:30 IST
జిల్లాలో 24గంటల వ్యవధిలో 343 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించింది
ఏడుగురు మృతి
కడప, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 24గంటల వ్యవధిలో 343 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించింది. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 19,721కు చేరుకున్నాయి. కరోనాతో ఏడుగురు మృతిచెందారు. జిల్లాలో కరోనాతో 213 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకూ 2,11,953 మంది నుంచి స్వాబ్ నమూనాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 2,432 మంది నుంచి నమూనాలు సేకరించారు. కరోనా సోకి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న 285 మందిని డిశ్చార్జి చేశారు. దీంతో ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 14,874 మందికి చేరుకుంది. 3336 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.