-
-
Home » Andhra Pradesh » Kadapa » 27 members lady khaidi
-
27 మంది మహిళా ఖైదీలు విడుదల
ABN , First Publish Date - 2020-11-28T05:25:54+05:30 IST
మహిళా ఖైదీల ఎదురుచూపులు రెండేళ్లకు ఫలించాయి. ప్రభుత్వం జారీ చేసిన 142 జీవోతో కడపలో ఉన్న మహిళా ప్రత్యేక కారాగారం నుంచి 27 మంది శుక్రవారం విడుదలయ్యారు.

కడప(సిటీ), నవంబరు 27: మహిళా ఖైదీల ఎదురుచూపులు రెండేళ్లకు ఫలించాయి. ప్రభుత్వం జారీ చేసిన 142 జీవోతో కడపలో ఉన్న మహిళా ప్రత్యేక కారాగారం నుంచి 27 మంది శుక్రవారం విడుదలయ్యారు. విడుదలైన మహిళా ఖైదీలకు శ్రీదండి చిన్నజీయరు స్వామి కుట్టుమిషన్లు, ఆడిటర్ షరీ్‌ఫఖాన్ దుస్తులు, స్వీట్లు అందించారు. జైళ్ల డీఐజీ వరప్రసాద్ మాట్లాడుతూ క్షమాభిక్షతో ఖైదీలను విడుదల చేయడం ఆనవాయితీ అయినా మహిళలను విడుదల చేయాలని సీఎం భావించడంతోనే ఇంతటి మంచి కార్యక్రమం అమలుకు నోచుకుందన్నారు.
విడుదలైన వారు వీరే...
కడప మహిళా ప్రత్యేక కారాగారం నుంచి... బండి పద్మక్క, ఎం.ఉమాదేవి, లావణ్య, పవిత్రబాయి, లక్ష్మీదేవి, రమణమ్మ, కె.పద్మావతమ్మ, చంద్రకళ, శాంతమ్మ, రాజమ్మ, సీఏ సుబ్బమ్మ, కె.నాగవేణి, జి.బాంధవి, పి.అమీనా, లింగమ్మ, డి.మరియమ్మ, నిర్మల, భారతి, జ్యోతి, డి.లక్ష్మి, వి.గురమ్మ, ఈశ్వరమ్మ, ఎం.మేరీ, సావిత్రి, జి.నారాయణమ్మ, ఎం.ఈశ్వరమ్మ. గ్రేసమ్మ విడుదలయ్యారు.