మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-12-20T05:07:16+05:30 IST

మండలంలోని గుర్రప్పపాళెం గిరిజనకాలనీ, గుండాలపల్లె మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్‌ డిమాండు చేశారు.

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి
గుర్రప్పపాళెం గిరిజన కుటుంబాన్ని పరామర్శిస్తున్న పంతగాని నరసింహప్రసాద్‌

టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్‌

రైల్వేకోడూరు, డిసెంబరు, 19: మండలంలోని గుర్రప్పపాళెం గిరిజనకాలనీ, గుండాలపల్లె మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్‌ డిమాండు చేశారు. ఇటీవల రైల్వేకోడూరు మండలంలోని గుర్రప్పపాళెం గిరిజన కాలనీ, గుండాలపల్లె గ్రామాలకు చెందిన యువకులు తుపాలకుల పెంచలయ్య, శివరామక్రిష్ణ లు ఈత కెళ్లి మృత్యువాత పడిన కుటుంబాలను శనివారం ఆయన పరామర్శించి ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు ఇంత వరకు మృతుల కుటుంబాలకు భరోసా ఇవ్వలేదని ఆరోపించారు.  గుర్రప్పపాళెం గిరిజన కాలనీకి వర్షాలు వస్తే పూర్తిగా రాకపోకలు స్తంభించిపోతాయని తెలిపారు. టీడీపీ కార్యకర్తలతో కలసి గుంజననది ని దాటి వెళ్లి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం కాజ్‌వేని నిర్మించాలని డిమాండు చేశారు. అనంతరం కార్యకర్తలతో కలసి గుండాలపల్లెకు వెళ్లి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం నుంచి వారికి రావాల్సిన ఎక్స్‌గ్రేషియా కోసం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.కాగా పంతగాని నరసింహప్రసాద్‌ రాష్ట్ర టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడి హోదా మొట్టమొదటి సారిగా రావడంతో  నియోజకవర్గంలోని దళిత, గిరిజన యువకులు, వివిధ రంగాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అందరూ ఘనంగా స్వాగతం పలికి పూలమాలలతో ముంచెత్తెరు. తర్వాత స్థానిక వెంకయ్యస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు బొక్కసం సునీల్‌, టీడీపీ నేతలు లారీ సుబ్బరాయుడు, మావిళ్ల సుబ్బరాయుడు, సతీ్‌షకుమార్‌రాజు, యువ నాయకులు కస్తూరి దినేష్‌, సిద్ధేశ్వర, ఎన్‌వీ ప్రసాద్‌, శ్రీను, బత్తల శివ, యశ్వంత్‌, రామక్రిష్ణ, గిరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-20T05:07:16+05:30 IST