-
-
Home » Andhra Pradesh » Kadapa » 23 nominations on the second day in yerra guntla
-
ఎర్రగుంట్లలో రెండో రోజు 23 నామినేషన్లు
ABN , First Publish Date - 2020-03-13T10:31:26+05:30 IST
ఎర్రగుంట్ల నగరపంచాయతీలో రెండో రోజున నామినేషన్ల జోరు కొనసాగింది. మొదటిరోజున కేవలం మూడేనామినేషన్లు వేయగా రెండో

ఎర్రగుంట్ల, మార్చి12: ఎర్రగుంట్ల నగరపంచాయతీలో రెండో రోజున నామినేషన్ల జోరు కొనసాగింది. మొదటిరోజున కేవలం మూడేనామినేషన్లు వేయగా రెండో రోజున 23నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ తరపున 2, వైసీపీ తరపున 20, స్వతంత్ర అభ్యర్థి 1 నామినేషన్లు వచ్చాయి. 11, 12తేదీల్లో మొత్తం 26 నామినేషన్లు దాఖలైనట్లు అధి కారులు తెలిపారు. వైసీపీ తరుపున ఛైర్మన్ అభ్యర్థిగా ఎమ్మెల్యే సోదరుడు మూలె హర్షవర్దన్‌రెడ్డి 16వ వార్డునుంచి నామినేషన్ వేశారు. అలాగే ఆయన సతీమణి శ్వేతరెడ్డి కూడా 16వ వార్డుకు రెండు సెట్ల నామినేషన్లు వేశారు. కొందరు నామినేషన్ల సమయంలో ఎన్నికల నిబందనలకు విరుద్దంగా ప్రవర్తించారనే విమర్శలు వెల్లువెత్తాయి.