20న ఏపీ సెట్‌ పరీక్ష

ABN , First Publish Date - 2020-12-12T05:21:17+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబులిటి టెస్ట్‌ (ఏపీసెట్‌) ఈ నెల 20వ తేదీన జిల్లాలోని ఎనిమిది కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు సెట్‌ ప్రాంతీయ సమన్వయకర్త ప్రొఫెసర్‌ బాగినేని శ్రీనివాస్‌ తెలిపారు.

20న ఏపీ సెట్‌ పరీక్ష

కడప(వైవీయూ), డిసెంబరు 11: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబులిటి టెస్ట్‌ (ఏపీసెట్‌) ఈ నెల 20వ తేదీన జిల్లాలోని ఎనిమిది కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు సెట్‌ ప్రాంతీయ సమన్వయకర్త ప్రొఫెసర్‌ బాగినేని శ్రీనివాస్‌ తెలిపారు. శుక్రవారం వైవీయూలో పరీక్షల నిర్వహణ సమితి అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎనిమిది కేంద్రాల్లో 2,416 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుందని, విద్యార్థులను ఉదయం 9.30 గంటల లోపే అనుమతిస్తామని తెలిపారు. ఈ నెల 12 నుంచి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. 

పరీక్ష కేంద్రాల వివరాలు ఇలా : 

కడప నగరంలోని ఆల్‌హబీబ్‌ డిగ్రీ కాలేజీ, ఎస్‌కేఆర్‌అండ్‌ ఎస్‌కేఆర్‌ డిగ్రీ కాలేజీ, గవర్నమెంట్‌ కాలేజీ ఫర్‌మెన్‌, ఎస్‌వీ డిగ్రీ కాలేజీ, శ్రీహరి డిగ్రీ కాలేజీ, నాగార్జున ఉమెన్స్‌ కాలేజీ, వివేకానంద మహిళా డిగ్రీ కాలేజీలను పరీక్షా కేంద్రాలుగా నిర్వహించామన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఎం.ఈశ్వర్‌రెడ్డి, డాక్టర్‌ జయంతికశ్యప్‌, డాక్టర్‌ సుబ్బారెడ్డి, డాక్టర్‌ శ్రీధర్‌బాబు, డాక్టర్‌ ఎస్‌వీ కృష్ణారావు, డాక్టర్‌ అనిత పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T05:21:17+05:30 IST