18 నుంచి వైవీయూ పీజీ సెమిస్టర్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2020-12-11T05:11:43+05:30 IST

వైవీయూ అనుబంధ పీజీ కళాశాలల పీజీ ఇంటిగ్రేటెడ్‌ ఎంఎ్‌ససీ ఫైన్‌ ఆర్ట్స్‌ విద్యార్థులకు ఈ నెల 18 నుంచి పరీక్షలను నిర్వహిస్తున్న ట్లు ప్రిన్సిపాల్‌ సాంబశివారెడ్డి తెలిపారు.

18 నుంచి వైవీయూ పీజీ సెమిస్టర్‌ పరీక్షలు

కడప(వైవీయూ), డిసెంబరు 10: వైవీయూ అనుబంధ పీజీ కళాశాలల పీజీ ఇంటిగ్రేటెడ్‌ ఎంఎ్‌ససీ ఫైన్‌ ఆర్ట్స్‌ విద్యార్థులకు ఈ నెల 18 నుంచి పరీక్షలను నిర్వహిస్తున్న ట్లు ప్రిన్సిపాల్‌ సాంబశివారెడ్డి తెలిపారు. ఎకనామిక్స్‌, ఇంగ్లీషు, ఉర్దూ, హిస్టరీ, ఆర్కియాలజీ, ఎన్‌ సీజే, పొలిటికల్‌ సైన్స్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఎంపీఈడీ తెలుగు, విభాగాలకు రెండవ సెమిస్టర్‌ పరీక్షలు జరుగనున్నాయన్నారు. ఇంటిగ్రేటెడ్‌ పీజీ రెండవ, 4వ సెమిస్టర్‌ పరీక్షలు ఎన్‌సీఏ విద్యార్థులకు రెండవ సెమిస్టర్‌, ఫైన్‌ ఆర్ట్స్‌ విద్యార్థులకు 2వ, 4వ సెమిస్టర్‌ పరీక్షలు జరుగనున్నాయన్నారు. ఈ నెల 27 నుంచి కామర్స్‌ ఎంబీఏ, ఎంసీఏ 4వ సెమిస్టర్‌, ఎంఎ్‌ససీ ఇంటిగ్రేటెడ్‌ 6వ సెమిస్టర్‌ బీఎ్‌సఏ 4వ, 8వ సెమిస్టర్‌ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. జనవరి 4 నుంచి బయోకెమిస్ట్రీ, బాటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాల్‌మెంటల్‌ సైన్స్‌, జనటిక్‌ జునోమిక్స్‌, జియాలజీ, మెటీరియల్‌ సైన్స్‌, మ్యాథ్స్‌, మైక్రో బయాలజీ, ఫిజిక్స్‌, సైకాలజీ, జువాలజీ పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు.

Updated Date - 2020-12-11T05:11:43+05:30 IST