రైతుల ఖాతాలలో రూ.18 వేల కోట్లు జమ

ABN , First Publish Date - 2020-12-26T05:16:24+05:30 IST

అటల్‌ బిహారీవాజ్‌పేయి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా 9కోట్ల మంది రైతులకు నేరుగా వారివారి ఖాతాల్లో 18వేల కోట్ల రూపాయలను జమచేయడం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.

రైతుల ఖాతాలలో రూ.18 వేల కోట్లు జమ
మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి

 బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి

రాజంపేట, డిసెంబరు25 : అటల్‌ బిహారీవాజ్‌పేయి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా 9కోట్ల మంది రైతులకు నేరుగా వారివారి ఖాతాల్లో 18వేల కోట్ల రూపాయలను జమచేయడం జరుగుతోందని బీజేపీ  రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. రాజంపేట పట్టణంలో శుక్రవారం జరిగిన వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ఫ్లాష్‌లా వచ్చిందని.. ప్లాప్‌లా పోతుందన్నారు.  తాడిపత్రి సంస్కృతి పోవాలంటే తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే స్కీములు ఎత్తివేసి చాక్‌లెట్లు, బిస్కెట్లు లాంటివి పెట్టి లబ్ధిపొందాలని జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రాన్ని సారాయి... స్కాచ్‌గా మార్చారన్నారు. రాష్ట్రాన్నంతా వ్యాపారంగా చేసి సర్వనాశనం చేస్తున్న ఘనత జగన్‌ మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఆదినారాయణరెడ్డి ఆరోపించారు.   అనంతరం బీజేపీ రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఎ.వి.సుబ్బారెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమే్‌షనాయుడు, బీజేపీ రాజంపేట అసెంబ్లీ కన్వీనర్‌ పోతుగుంట రమే్‌షనాయుడు, బీజేవైఎం జాతీయ కార్యదర్శి సురేష్‌ మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడం తఽథ్యమన్నారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సురే్‌షరాజు, వెంకటసుబ్బయ్యనాయుడు, ప్రభావతి, శ్రీనివాసులు, పాపయ్య, నర్సింగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Updated Date - 2020-12-26T05:16:24+05:30 IST