101 దుంగల స్వాధీనం.. దొంగల అరెస్టు

ABN , First Publish Date - 2020-12-30T05:39:44+05:30 IST

సిద్దవటంలో 101 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ప్రసాద్‌ తెలిపారు.

101 దుంగల స్వాధీనం.. దొంగల అరెస్టు
పట్టుబడిన దుంగలు, స్మగ్లర్లతో ఫారెస్ట్‌ అధికారులు

సిద్దవటం, డిసెంబరు29 : సిద్దవటంలో 101 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ప్రసాద్‌ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిద్దవటం మండలం మధుర్‌ బీట్‌కోళ్ల బావి సమీపంలో 101 ఎర్రచందనం దుంగలను కంటైనర్‌లో తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో తనిఖీ చేశామన్నారు. ఓ కంటైనర్‌ను ఆపగా స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను, వాహనాన్ని వదిలేసి పరుగులు తీశారని, తమ సిబ్బంది వెంబడించి ఇద్దరిని పట్టుకున్నారన్నారు. 48మంది తప్పించుకున్నార న్నారు. ఆ ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు. కాగా దుంగల విలువ దాదాపు రూ.12లక్షలు ఉంటుందన్నారు. కూలీలు తమిళనాడుకు చెందిన వారుగా గుర్తిం చామన్నారు. పట్టుబడిన వేలు, గొంది వదన అనే వీరిద్దరూ తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాకు చెందిన వారన్నారు. నిందితులను కోర్టుకు హాజరు పరుస్తామ న్నారు. ఎఫ్‌ఎ్‌సఓ షకీల్‌ అహమ్మద్‌, ఎఫ్‌బీఓలు సుబ్రహ్మణ్యం, దీపిక, నారాయణరెడ్డి, డి.హైమావతి, మరో పది మంది ప్రొటెక్షన్‌ వాచర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T05:39:44+05:30 IST