10 తులాల బంగారు చోరీ

ABN , First Publish Date - 2020-11-26T04:53:24+05:30 IST

కడప నగరం ఎన్జీఓ కాలనీలోని ఓ ఇంట్లో 10 తులాల బంగారు చోరీ జరిగినట్లు చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు.

10 తులాల బంగారు చోరీ

కడప(కైం), నవంబరు 25: కడప నగరం ఎన్జీఓ కాలనీలోని ఓ ఇంట్లో 10 తులాల బంగారు చోరీ జరిగినట్లు చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు... వాసవీ అపార్టుమెంటులో ఉన్న శ్రీహరిబాబు ఈ నెల 22న కుటుంబ సభ్యులతో కలిసి విజయ వాడకు వెళ్లారు. 24వ తేది రాత్రి ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. 

Read more