రికార్డులను సక్రమంగా నిర్వహించాలి : జడ్పీ సీఈవో చైతన్య

ABN , First Publish Date - 2020-11-13T06:34:25+05:30 IST

సచివాలయ సిబ్బంది రికార్డులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా పరిషత్‌ సీఈవో చైతన్య ఆదేశించారు.

రికార్డులను సక్రమంగా నిర్వహించాలి : జడ్పీ సీఈవో చైతన్య

యడ్లపాడు, నవంబరు 12 : సచివాలయ సిబ్బంది రికార్డులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా పరిషత్‌ సీఈవో చైతన్య ఆదేశించారు. మం డలంలోని జాలాది, యడ్లపాడు- గ్రామసచివాలయాలను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా యడ్లపాడు-1 సచివాలయాన్ని సందర్శించిన ఆయన సిబ్బంది నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జాలాది గ్రామసచివాలయాన్ని సందర్శించిన ఆయన జాబితాల ప్రదర్శన సక్రమంగా లేకపోవడం, రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్‌లకు మెమోలు జారీ చేయాలని, రికార్డుల నిర్వహణపై సమగ్రంగా శిక్షణ ఇవ్వాలని ఎంపీడీవోను ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో పి.మాధురి, ఈవోపీఆర్డీ కె.శ్రీనివాసరావులు ఉన్నారు. 


Updated Date - 2020-11-13T06:34:25+05:30 IST