సాగర్‌ కుడికాలువలో గల్లంతై యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-11-26T04:52:35+05:30 IST

కారంపూడి సమీప వినుకొండ రహదారిలోని సాగర్‌ కుడికాలువలో బుధవారం ఉదయం స్నానానికి దిగిన ఓ యువకుడు గల్లంతయ్యాడు.

సాగర్‌ కుడికాలువలో గల్లంతై యువకుడి మృతి
భవానీనాయక్‌ (ఫైల్‌)

కారంపూడి, నవంబరు 25: కారంపూడి సమీప వినుకొండ రహదారిలోని సాగర్‌ కుడికాలువలో బుధవారం ఉదయం స్నానానికి దిగిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. బొల్లాపల్లి మండలం హనుమాపురం తండాకు చెందిన బూచే భవానీనాయక్‌ (18) భవానీమాల ధరించాడు. దీనిలో భాగంగా కారంపూడిలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. బుధవారం ఉదయం తన చెల్లిని తీసుకొని సాగర్‌ కాలువ వద్దకు వచ్చాడు. చెల్లిని ఒడ్డున కూర్చోబెట్టి తన వస్తువులు ఆమెకిచ్చి స్నానానికి ఉపక్రమించాడు. కాలువ ఉధృతికి తట్టుకోలేక కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న బంధువులు కాలువలో గాలించగా భవానీనాయక్‌ శవమై తేలాడు. తల్లి సక్రీబాయి, తండ్రి వాగ్యా నాయక్‌ రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గురుజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Read more