జీజీహెచ్‌ ఐసోలేషన్‌వార్డు నుంచి యువకుడి పరార్‌

ABN , First Publish Date - 2020-03-27T09:17:50+05:30 IST

కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలతో గుంటూరు జీజీహెచ్‌లోని ఐసోలేషన్‌ వార్డులో చేరిన యువకుడు పరారీ అయ్యాడు.

జీజీహెచ్‌ ఐసోలేషన్‌వార్డు నుంచి యువకుడి పరార్‌

గుంటూరు, మార్చి 26: కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలతో గుంటూరు జీజీహెచ్‌లోని ఐసోలేషన్‌ వార్డులో చేరిన యువకుడు పరారీ అయ్యాడు. బుధవారం కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఓ యువకుడిని కరోనా అనుమానిత లక్షణాలతో ఐసోలేషన్‌ వార్డులో చేర్చారు. అక్కడకు చేరిన ఆ యువకుడు బుధవారం సాయంత్రమే పారిపోయాడు. తిరిగి వస్తాడేమోనని ఎదురు చూసినారాలేదు. జీజీహెచ్‌లో గాలించినా అతని ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో గురువారం ఆర్‌ఎంవో ఆదినారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-03-27T09:17:50+05:30 IST