యువకుడిపై పోక్సో కేసు నమోదు

ABN , First Publish Date - 2020-02-12T11:26:38+05:30 IST

మాచర్ల పట్టణ పోలీస్‌స్టేషన్లో మంగళవారం ఓ యువకుడిపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదైంది. పట్టణానికి చెందిన 23 సంవత్సరాల వయసుగల యువకుడు ఆడుకుంటున్న పదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి

యువకుడిపై పోక్సో కేసు నమోదు

మాచర్ల, ఫిబ్రవరి 11: మాచర్ల పట్టణ పోలీస్‌స్టేషన్లో మంగళవారం ఓ యువకుడిపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదైంది. పట్టణానికి చెందిన  23  సంవత్సరాల వయసుగల యువకుడు ఆడుకుంటున్న పదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి శిథిలావస్థలో ఉన్న ఇంటిలోకి తీసుకెళ్లాడు. బాలిక ధరించిన దుస్తులను తొలగిస్తుండగా  బాలిక ఒక్కసారిగా గట్టిగా కేకలు పెట్టింది.  గమనించిన స్థానికులు అక్కడకు చేరుకునేలోపే ఆ యువకుడు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్‌ఐ మోహన్‌ సంఘటనా ప్రదేశానికి చేరుకొని వివరాలు సేకరించారు. యువకుడిపై పోస్కో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 

Updated Date - 2020-02-12T11:26:38+05:30 IST