షాపుల్లో స్వీట్లు కొంటున్నారా..? తయారు చేసిన ఎన్నిరోజులలోపు తినొచ్చంటే...

ABN , First Publish Date - 2020-11-07T16:18:52+05:30 IST

హార భద్రత, ప్రమాణాల చట్టం 2006ను సవరిస్తూ కేంద్రం ఆదేశాలను జారీచేసింది. ఈ చట్టం ప్రకారం అక్టోబరు1వ తేదీ నుంచి స్వీట్ల దు కాణాల వ్యాపారులు స్వీట్లు ఎప్పుడు తయా రుచేసింది..? ఎన్ని రోజుల్లో తినాలి వంటి వివరాలను ప్యాకెట్లపై తప్పనిసరిగా ముద్రించాలి. అదే లూజు స్వీట్లు అయితే అవి ఉంచిన బాక్సుల ఎదురుగా వివరాలను ప్రదర్శించాలి.

షాపుల్లో స్వీట్లు కొంటున్నారా..? తయారు చేసిన ఎన్నిరోజులలోపు తినొచ్చంటే...

స్వీట్ తినే ముందు.. డేట్ చూడు..!

ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ అఫ్‌ ఇండియా నూతన నిబంధనలు

స్వీట్లపై తయారీ వివరాలు తప్పనిసరి..

లేని పక్షంలో రూ.2లక్షల వరకు జరిమానా

వినియోగదారులు ఫిర్యాదు చేసే అవకాశం


గుంటూరు(తూర్పు): ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006ను సవరిస్తూ కేంద్రం ఆదేశాలను జారీచేసింది. ఈ చట్టం ప్రకారం అక్టోబరు1వ తేదీ నుంచి స్వీట్ల దు కాణాల వ్యాపారులు స్వీట్లు ఎప్పుడు తయా రుచేసింది..? ఎన్ని రోజుల్లో తినాలి వంటి వివరాలను ప్యాకెట్లపై తప్పనిసరిగా ముద్రించాలి. అదే లూజు స్వీట్లు అయితే అవి ఉంచిన బాక్సుల ఎదురుగా వివరాలను ప్రదర్శించాలి. 


ఏ స్వీట్‌కు.. ఎన్నిరోజులు

నూతన సవరణల్లో ఏఏ స్వీట్లు ఎన్నిరోజుల్లో తినాలి, వాటి జీవితకాలం ఎంత అనే వివరాలను కూడా పొందుపరిచారు. దీని ప్రకారం కలఖండ్‌ వంటి స్వీట్లకు ఒక్కరోజు, నేతితో తయారుచేసిన స్వీట్స్‌, డ్రైఫ్రూట్స్‌, హల్వా, డ్రైఫ్రూట్‌ లడ్డు, అంజీర్‌ కేక్‌, కాజాలడ్డు వంటివి ఏడురోజులు, బేఫిన్‌ లడ్డు, ఆట లడ్డు, చనా లడ్డు, చనాబర్ఫీ, చిక్కీలు వంటివి దాదాపు 30రోజుల వరకు గడువు తేదీలు ఉండాలని ఆదేశించారు. ఇదే విషయాన్ని వినియోగదారులు గమనించాలని సూచించారు.


నిబంధనలు పాటించకపోతే... 

ఎవరైనా వ్యాపారి నిబంధనలు పాటించ కుండా వివరాలను ముద్రించకపోతే తొలి విడతగా అధికారులు హెచ్చరించి బోర్డుల ఏర్పాటుకు వారం గడువిస్తారు. అప్పటికీ పట్టించుకోకపోతే వారిపై కేసు నమోదు చేసి కోర్టులో జాయింట్‌ కలెక్టర్‌ ఎదుట హా జరు పరిచి సెక్షన్‌58 ప్రకారం రూ.2లక్షల వర కు జరిమానా విధిస్తారు. మూడోసారి కూడా పటుట్టబడితే వారి వ్యాపార లైసైన్స్‌లు రద్దు చేస్తారు. దీంతోపాటు స్వీట్లు తయారు చేసే వారికి, విక్రయించేవారికి మరో నిబంధనను కూడా తీసుకువచ్చింది. దీని ప్రకారం స్వీట్ల వ్యాపారులు తమ వార్షిక రిటర్నులను ఏటా మేనెల 31వతేదీలోపు ఫారండీతో సమర్పిం చాలి. లేనిపక్షంలో ఆ తరువాత రోజునుంచి ఆలస్య రుసుము కింద రోజుకు రూ.100 జరిమానా కట్టాలని నిబంధనను పెట్టింది.


పట్టించుకోని వ్యాపారులు..

నెలరోజుల క్రితం నూతన నిబంధనలు అ మల్లోకి వచ్చినా జిల్లాలో చాలామంది స్వీట్ల వ్యాపారులు పట్టించుకోవడం లేదు. వివరాల ను  ముద్రించకుండానే స్వీట్లను యథేచ్ఛగా వి క్రయిస్తున్నారు. ఇప్పటికే అధికారులు పలు సార్లు ప్రకటనలు చేసినప్పటికీ వ్యాపారుల్లో మాత్రం చలనం లేదు. ఆహార భద్రత అధి కారుల దాడులు కూడా అంతంతమాత్రంగా ఉండటంతో వ్యాపారులు కూడా ఈ విషయంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.


బోర్డులు ఏర్పాటు చేయకుంటే చర్యలు: గౌస్‌మొహిద్దీన్‌, జిల్లా ఆహార భద్రత ప్రమాణాల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌

తాజాగా వచ్చిన మార్గదర్శకాల మేరకు స్వీట్‌ దుకాణదారులు తప్పనిసరిగా బెస్ట్‌ బిఫోర్‌ తేదీల వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలి. చాలామంది వ్యాపారులు వివరాల బోర్డులను ఏర్పాటు చేయకుం డానే స్వీట్లు విక్రయిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. సదరు దుకాణాలపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధి స్తాం. వినియోగదారులు వివరాలను ముద్రించని స్వీట్లు కొనుగోలు చేయవద్దు. 



ఇలా ఫిర్యాదు చేయవచ్చు..

అధికారి (ఫోన్‌ నెంబర్‌)              డివిజన్‌ పరిధి                                     

 జి.వెంకటేశ్వరరావు (9494769742) గుంటూరు అర్బన్‌, రూరల్‌, తెనాలి, మంగళగిరి, రేపల్లె, బాపట్ల, తదితర ప్రాంతాలు

 ఎ.సుందరరామిరెడ్డి (9550772265) నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, మాచర్ల, పొన్నూరు తదితర ప్రాంతాలు           

 పి.ప్రణీత్‌ (9885137043) సత్తెనపల్లి, దాచేపల్లి, పిడుగురాళ్ళ, అమరావతి, తాడికొండ,తుళ్లూరు. అచ్చంపేట, క్రోసూరు

Updated Date - 2020-11-07T16:18:52+05:30 IST