రాష్ట్రస్థాయి యోగా పోటీలలో బాపట్ల విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2020-12-19T06:20:12+05:30 IST

రాష్ట్రస్థాయి యోగా పోటీలలో బాపట్ల పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రతిభను కనబరిచినట్లు ప్రిన్సిపాల్‌ లక్ష్మీ కౌసల్య తెలిపారు. శుక్రవారం పాఠశాల ప్రాంగణంలో బహుమతులు సాధించిన విద్యార్థులను ఆమె అభినందించారు.

రాష్ట్రస్థాయి యోగా పోటీలలో బాపట్ల విద్యార్థుల ప్రతిభ
రాష్ట్రస్థాయి యోగా పోటీలలో బహుమతులు సాధించిన విద్యార్థులతో బాపట్ల పబ్లిక్‌ స్కూల్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మీకౌసల్య తదితరులు

బాపట్ల టౌన్‌, డిసెంబరు 18: రాష్ట్రస్థాయి యోగా పోటీలలో బాపట్ల పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రతిభను కనబరిచినట్లు ప్రిన్సిపాల్‌ లక్ష్మీ కౌసల్య తెలిపారు. శుక్రవారం పాఠశాల ప్రాంగణంలో బహుమతులు సాధించిన విద్యార్థులను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో వర్చువల్‌ పద్ధతిలో నిర్వహించిన యోగా పోటీలలో నాల్గొ తరగతి విదార్థులు ఎన్‌.హరిత గోల్డ్‌మెడల్‌, ఎన్‌.రజిత సిల్వర్‌మెడల్‌ను సాధించినట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జనవరి 3న మహారాష్ట్రలో జరిగే జాతీయ యోగా పోటీలలో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో బాపట్ల ఎడ్యుకేషన్‌ సొసైటీ కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు, కరస్పాండెంట్‌ పి.భావన్నారాయణచౌదరి, ట్రెజర్‌ సి.వెంకయ్య, అకడమిక్‌ అడ్వయిజర్‌ కె.విజయ్‌కుమార్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 


Read more