ధనదాహంతో యువకుడిని బలిగొన్నారు...!

ABN , First Publish Date - 2020-09-14T08:57:45+05:30 IST

ముక్కుపచ్చలారని 19ఏళ్ల యువకుడిని పొట్టనపెట్టుకున్నారు.

ధనదాహంతో యువకుడిని బలిగొన్నారు...!

యరపతినేని శ్రీనివాసరావు


గుంటూరు, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ముక్కుపచ్చలారని 19ఏళ్ల యువకుడిని పొట్టనపెట్టుకున్నారు.. పల్నాడు ప్రజానీకానికి ఇప్పుడేం సమాధానం చెప్తారని ఎమ్మెల్యే కాసు మహేశ్వరరెడ్డిని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నిలదీశారు. ఆదివారం ఆయన ఆన్‌లైన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. పాతికేళ్లుగా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న  కార్మికుల కుటుంబాల్లో కాసు ధనదాహం చిచ్చు పెట్టిందని మండిపడ్డారు.


నరసరావుపేటకు చెందిన బయ్యన్న అనే రౌడీషీటర్‌ను నడికుడిలో ఉంచి  కార్మికులు పనిచేసుకుంటున్న క్వారీ నుంచి ట్రక్కుకు రూ.1,400 వసూలుచేసి రోజూ రూ.5లక్షల దాకా ఎమ్మెల్యే కాసు మహేశ్వరరెడ్డికి అప్పజెపుతున్నారని ఆరోపించారు. మా కష్టాన్ని మీకెందుకు ఇవ్వాలన్నందుకే కార్మికులపై దాడి చేశారని తెలిపారు. చనిపోయిన నీలకంఠ కుటుంబానికి  డబ్బులిస్తే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. నీలికంఠ కుటుంబానికి రూ.యాభై లక్షల పరిహారం ఇవ్వాలని, నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-09-14T08:57:45+05:30 IST