నిందితులను వైసీపీ నేతలే కాపాడుతున్నారు
ABN , First Publish Date - 2020-11-03T14:22:39+05:30 IST
నారాయణపురం ఘటనలో నిందితులను వైసీపీ నాయకులు కాపాడుతున్నారని..
ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటి?
పిడుగురాళ్ల(గుంటూరు): నారాయణపురం ఘటనలో నిందితులను వైసీపీ నాయకులు కాపాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. కత్తిపోట్ల ఘటనలో నిందితులను ఇంతవరకు అరెస్ట్ చేయక పోవటం ఏంటని ప్రశ్నించారు. కాసు అనుచరుడైన భయ్యన్న, దాచేపల్లి వైసీపీ మండల కన్వీనర్ జాకీర్ హుస్సేన్ కుమారులు కత్తిపోట్ల ఘటనలో పాల్గొన్న ప్పటికీ ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదో పోలీ సులు సమాధానం చెప్పాలన్నారు. చనిపోయిన నీలకంఠబాబు, గాయపడిన వా రికి ఇంతవరకు సహాయం చేయకపోగా పరామర్శతో సరిపుచ్చారన్నారు. వడ్డెర కార్మికుల నుంచి వసూలు చేసిన రూ.25కోట్లలో రూ.50లక్షలు ఒక్కో కుటుంబా నికి అందజేయాలని డిమాండ్ చేశారు.
టీడీపీ హయాంలో గత 25 ఏళ్లుగా వడ్డెర కార్మికులు, తమ వృత్తిని ఏ ఇబ్బంది లేకుండా చేసుకున్నారని గుర్తు చేశారు. మూడు నెలల క్రితం భట్రుపాలెంలో రాజానాయక్, అంబాపురం లో దళిత యువకుడు విక్రమ్ హత్యకేసులో నిందితులను ఇంతవరకు అరెస్ట్ చేయలేదన్నారు. పల్నాడులో జరిగిన ఘటనలపై నిందితులను అరెస్ట్ చేసి బాధిత కుటుంబాలను అరెస్ట్ చేయకపోతే న్యాయపోరాటాలకు సిద్ధమవుతామని తెలి పారు. అధికారంలోకి వచ్చాక ఒక్కో కుటుంబానికి ఎకరం భూమి జీవనోపాధిగా ఇస్తామని యరపతినేని తెలిపారు.