అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి

ABN , First Publish Date - 2020-12-19T05:54:50+05:30 IST

రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరిగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని వైసీపీ ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్‌, ఎండీ ముస్తఫా, మేరుగ నాగార్జున పేర్కొన్నారు.

అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి
ప్రదర్శన చేస్తున్న ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరిధర్‌, ఏసురత్నం తదితరులు

గుంటూరులో వైసీపీ నేతల ప్రదర్శన

గుంటూరు, డిసెంబరు 18: రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరిగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని వైసీపీ ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్‌, ఎండీ ముస్తఫా, మేరుగ నాగార్జున పేర్కొన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరులో వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి ఛైతన్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం, డీసీసీబీ చైర్మన్‌ లాలుపురం రాము, వైసీపీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ, వైసీపీ నేత కావటి మనోహర్‌నాయుడు, నాయకులు షౌకత్‌, సుంకర రామాంజనేయులు, నూనె ఉమామహేశ్వరరెడ్డి, గౌస్‌, రమేష్‌, కమల్‌ తదితరులు పాల్గొన్నారు. 


Read more