రైతులను, కార్మికులను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2020-12-31T05:15:00+05:30 IST
వరి, పత్తి, మిరప పంటలు పూర్తిగా దెబ్బతిని నష్టపోయిన రైతులను, కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకులు యరపతినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
పిడుగురాళ్ల, డిసెంబరు 30: వరి, పత్తి, మిరప పంటలు పూర్తిగా దెబ్బతిని నష్టపోయిన రైతులను, కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకులు యరపతినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అధిక వర్షాలతో పంటలన్నీ దెబ్బతిన్నాయన్నారు. ఇసుక అందుబాటులోకి రాకపోవటం వల్ల లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఏడాది నుంచి కుటుంబాలతో పస్తులు ఉంటున్నారన్నారు. రాబోయే సంవత్సరంలోనైనా పల్నాడు ప్రాంతం పాడిపంటలు, సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నట్లు యరపతినేని ఆకాంక్షించారు.