ఇద్దరు పిల్లలు సహా మహిళ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-02-08T09:45:32+05:30 IST

ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించిన మహిళను పోలీసులు కాపాడిన సంఘటన విజయపురిసౌత్‌ సమీపంలోని కుడి కాలువ వద్ద

ఇద్దరు పిల్లలు సహా మహిళ ఆత్మహత్యాయత్నం

  • అడ్డుకున్న పోలీసులు 

విజయపురిసౌత్‌: ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించిన మహిళను పోలీసులు కాపాడిన సంఘటన విజయపురిసౌత్‌ సమీపంలోని కుడి కాలువ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ పైలాన్‌ కాలనీకి చెందిన బండారు లలిత కుటుంబ కలహాల నేపథ్యంతో తన కుమార్తె, కుమారుడిని తీసుకొని కుడి కాలువ వద్దకు చేరుకుంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న హెడ్‌ కానిస్టేబుళ్లు అమీర్‌బాషా, విజయ్‌లు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆమెను చూశారు. ఇక్కడ ఏం చేస్తున్నావని ప్రశ్నించడంతో ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చినట్లు ఆమె తెలిపింది. దీంతో పోలీసులు లలిత భర్త అంజికి ఫోను చేసి  పిలిపించారు. ఇద్దరికీ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మహిళను, ఆమె పిల్లలను కాపాడిన అమీర్‌బాషా, విజయ్‌లను ఎస్‌ఐ పాల్‌ రవీందర్‌, ఏఎస్‌ఐ మస్తాన్‌వలి, సిబ్బంది అభినందించారు. 

Updated Date - 2020-02-08T09:45:32+05:30 IST