-
-
Home » Andhra Pradesh » Guntur » Woman commit suicide with two children
-
హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్లి.. ఇద్దరు పిల్లలు సహా వివాహిత ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-05-18T17:02:40+05:30 IST
తోడికోడలు వేధింపులు తాళలేక ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం గుంటూరు జిల్లా పిడుగురాళ్ల

తోటికోడలి వేధింపులతో.. ఇద్దరు పిల్లలు సహా వివాహిత ఆత్మహత్య
పిడుగురాళ్ల (గుంటూరు): తోడికోడలు వేధింపులు తాళలేక ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామంలో చోటుచేసుకుంది. జూలకంటి రాధిక (35)... ఆమె ఇద్దరు పిల్లలు క్రిస్టప్ రెడ్డి (4), రుషిత (3)లకు ఆదివారం రాత్రి ఉరివేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్‌లో నివాసం ఉంటూ రాధిక భర్త లచ్చిరెడ్డి, ఆయన సోదరుడు వాటర్‌ప్లాంట్ నడుపుతూ ఒకేచోట కలిసి వుంటున్నారు. అక్కడ రాధిక తోడికోడలి ఐదేళ్ల కుమార్తె ఈనెల 14న తెలియక లైజాల్ లిక్విడ్ తాగి చనిపోయింది.
రాధిక వల్లే తన కుమార్తె చనిపోయిందని తోడికోడలు నిందలు వేస్తూ వేధింపులకు పాల్పడుతోంది. దీంతో రాధిక అవమానభారంతో హైదరాబాద్ నుంచి ఇద్దరు పిల్లలను తీసుకుని వారం రోజుల క్రితం తుమ్మలచెరువులోని పుట్టింటికి వచ్చింది. పుట్టింటికి వచ్చిన తర్వాత కూడా తోడికోడలు వేధింపులు ఆగకపోవటంతో తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తల్లిదండ్రులు గమనించే సరికి ఈ దారుణం జరిగింది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.