హైదరాబాద్‌కు బస్సులెప్పుడు?

ABN , First Publish Date - 2020-10-04T13:55:44+05:30 IST

గుంటూరు రీజియన్‌ నుంచి హైదరా బాద్‌కు ఆర్టీసీ సర్వీసులు ఎప్పుడు నడుపుతారో..

హైదరాబాద్‌కు బస్సులెప్పుడు?

ప్రయాణ భారం

హైదరాబాద్‌కు నడవని ఆర్టీసీ సర్వీసులు

ఇరు రాష్ర్టాల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన

గుంటూరు రీజియన్‌లో రోజుకు రూ.14 లక్షల నష్టం

మరోవైపు చెలరేగిపోతున్న ప్రైవేటు ఆపరేటర్లు

ఒక్కో టిక్కెట్‌కు రూ.వెయ్యి వసూలు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): గుంటూరు రీజియన్‌ నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ సర్వీసులు ఎప్పుడు నడుపుతారో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం బెంగళూరు సర్వీసులు మొదలయ్యాయి. రేపోమాపో చెన్నైకి బస్సులు సిద్ధం చేస్తున్నారు. కానీ హైదరాబాద్‌కు ఆర్టీసీకి సర్వీసుల పునరుద్ధరణ ఎప్పుడనేది అంతుపట్టటం లేదు. మరోవైపు ప్రైవే టు ఆపరేటర్లకు అనుమతులివ్వటంతో ఛార్జీల దోపిడీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


తెలుగు రాష్ర్టాల మధ్య పర్మిట్‌ వివాదంతో హైదరాబాద్‌ సర్వీసులు డిపోలకే పరిమితమయ్యాయి. ఫలితంగా ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. గతంలో గుంటూరు రీజి యన్‌ నుంచి 98 సర్వీసులు హైదరాబాద్‌ కు నడిచేవి. వీటిలో 9 ఏసీ బస్సులు కాగా గుంటూరు 1 డిపో నుంచి రెండు, గుం టూరు-2 నుంచి నాలుగు, రేపల్లె 1, చిల కలూరిపేట 1, వినుకొండ ఒకటి ఉన్నాయి. రోజువారీగా 40వేల కిలోమీటర్లు రాకపోక లు సాగించగా రోజువారీ రూ.14 లక్షల ఆదాయం రీజియన్‌కు సమకూరేది. ఇంట ర్‌స్టేట్‌ పర్మిట్ల ప్రతిష్టంభనతో ఆర్టీసీ ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. 


మరో వైపు  రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఇంటర్‌ స్టేట్‌ పర్మిట్ల వివాదం కొందరు ప్రైవేటు ఆపరేటర్లకు కాసులు కురిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా దాదాపుగా 50కు పైగా ప్రైవేటు సర్వీసులు హైదరా బాద్‌కు నడుపుతున్నట్లు సమాచారం. వయా - విజయవాడ మీదుగా హైదరాబా ద్‌కు, మిర్యాలగూడ మీదుగా హైదరా బాద్‌కు రాకపోకలు సాగిస్తున్నాయి. గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్ళాలంటే ఏసీ, నాన్‌ ఏసీలకు రూ.వెయ్యి ఆ పైనే ఛార్జీ వసూలు చేస్తున్నారు. సాధా రణంగా హైద రాబాద్‌కు ఆర్టీసీ నాన్‌ ఏసీ రూ.410, ఏసీ రూ.550 అమరావతి ఏసీ రూ.700 ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే కొందరు ప్రైవేటు ఆపరేటర్లు తాజాగా రెండింతలు వసూలు చేస్తున్నార న్న ఆరో పణలు ఉన్నాయి. ఛార్జీల దోపిడీపై అధి కార యంత్రాంగం దృష్టిపెట్టకపోవటం పై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


అనుమతులు రాగానే..

ఇంటర్‌స్టేట్‌ పర్మిట్లకు సంబంధించి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం. అనుమతులు రాగా నే హైదరాబాద్‌కు సర్వీసులను అందుబాటులోకి తెస్తాం. 

 - ఎస్‌టీపీ రాఘవకుమార్‌, ఆర్టీసీ ఆర్‌ఎం

   

ఆర్టీసీని నిర్వీర్యం చేయటమే..

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఆర్టీసీని నిర్వీ ర్యం చేసేలా ఉంది. ప్రై వేటు ఆపరేటర్ల దోపిడీకి మార్గం సుగమం చే యటం తప్ప ఎటు వం టి లాభం లేదు. ఇప్ప టికైనా సామాన్య ప్రయాణికులకు మేలు చేసేలా ఇంటర్‌ స్టేట్‌ పర్మిట్లకు అనుమ తించి సర్వీసులను పునరుద్ధరించాలి. లేకుంటే రెండు రాష్ట్రాల ఆర్టీసీకి నష్టమే.


ప్రభుత్వ అసమర్ధతతోనే..

ప్రభుత్వ అసమర్ధతోనే సమస్య ఏర్పడుతోంది. కనీసం తెలంగాణతో చర్చలు జరపటంలో విఫల మవుతున్నారు. దాంతో ప్రైవేటు ఆపరేటర్ల ధనదా హానికి ప్రయాణికులు దోపిడీకి గురికావాల్సి వ స్తోంది. ఇప్పటికైనా ఇరు ప్రభుత్వాలు చొరవ చూపి ఆర్టీసీకి లైన్‌ క్లియర్‌ చేయాలి. 

- కొండా శివరామిరెడ్డి, అవగాహన సంస్థ కార్యదర్శి 



Updated Date - 2020-10-04T13:55:44+05:30 IST