సాగర్‌కు జలకళ

ABN , First Publish Date - 2020-09-12T10:05:42+05:30 IST

భారీగా వరద నీరు వచ్చి చేరడంతో శుక్రవారం నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ 14 క్రస్ట్‌గేట్ల ద్వారా అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.

సాగర్‌కు జలకళ

విజయపురిసౌత్‌, సెప్టెంబరు 11: భారీగా వరద నీరు వచ్చి చేరడంతో శుక్రవారం నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ 14 క్రస్ట్‌గేట్ల ద్వారా అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం నాటికి నాగార్జున సాగర్‌ నీటిమట్టం 589.90 అడుగులు ఉంది. ఇది 311.74 టీఎంసీలకు సమానం. కుడి కాలువ ద్వారా 5,529 క్యూసెక్కులు, 14 క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,09,902 క్యూసెక్కులు, లోలెవల్‌ కెనాల్‌ ద్వారా 600, ఎస్‌ఎల్‌బీసీ 1,800 , ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 28,095, మొత్తం ఔట్‌ఫ్లోగా 2,48,926 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు  2,48,926 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 884.60 అడుగులుంది. ఇది 213.40 టీఎంసీలకు సమానం.  

Updated Date - 2020-09-12T10:05:42+05:30 IST