డెల్టా కాలువలకు 2,000 క్యూసెక్కులు

ABN , First Publish Date - 2020-12-07T05:19:50+05:30 IST

ఎగువ జలాశయాల నుంచి వరదనీటిని స్వల్పంగా విడుదల చేస్తుండడంతో ప్రకాశం బ్యారేజి గేట్లను అధికారులు మూసివేశారు.

డెల్టా కాలువలకు 2,000 క్యూసెక్కులు

 తాడేపల్లి టౌన్‌, డిసెంబరు 6: ఎగువ జలాశయాల నుంచి వరదనీటిని స్వల్పంగా విడుదల చేస్తుండడంతో ప్రకాశం బ్యారేజి గేట్లను అధికారులు మూసివేశారు. ఆదివారం సాయంత్రానికి. పులిచింతల ప్రాజెక్టు, బ్యారేజి ఎగువన ఉన్న వివిధ వాగుల నుంచి 3,000 క్యూసెక్కుల వరదనీరు బ్యారేజి రిజర్వాయర్‌ వద్ద ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 2,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్టు ఇరిగేషన్‌ జేఈ దినేష్‌ తెలిపారు.


పశ్చిమ డెల్టాకు 1,818 క్యూసెక్కులు

  ప్రకాశం బ్యారేజి నుంచి కృష్ణా పశ్చిమడెల్టాకు 1,818 క్యూసెక్కుల నీటిని ఆదివారం విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజివద్ద నీటిమట్టం 12.0 అడుగులు ఉంది. దుగ్గిరాల సబ్‌ డివిజన్‌ నుంచి రేపల్లె కాలువకు 294 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 40, కొమ్మమూరు కాలువకు 945 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. 

Updated Date - 2020-12-07T05:19:50+05:30 IST