83మంది వీవీఐటీ విద్యార్థులకు టీసీఎస్‌ కొలువులు

ABN , First Publish Date - 2020-12-29T05:56:22+05:30 IST

ప్రముఖ టాటా కన్సల్‌టెన్సీ సర్వీసెస్‌ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన కోడ్‌ విటా, నేషనల్‌ క్వాలిఫైయర్‌ టెస్ట్‌ పరీక్షలో అధికంగా 83మంది వీవీఐటీ విద్యార్థులు నియమకాలు పొందారని కళాశాల చైర్మన్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌ తెలిపారు.

83మంది వీవీఐటీ విద్యార్థులకు టీసీఎస్‌ కొలువులు
ఉద్యోగాలు పొందిన విద్యార్ధులతో అధ్యాపక సిబ్బంది

పెదకాకాని, డిసెంబరు 28: ప్రముఖ టాటా కన్సల్‌టెన్సీ సర్వీసెస్‌ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన కోడ్‌ విటా, నేషనల్‌ క్వాలిఫైయర్‌ టెస్ట్‌ పరీక్షలో అధికంగా 83మంది వీవీఐటీ విద్యార్థులు నియమకాలు పొందారని కళాశాల చైర్మన్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌ తెలిపారు. కోడ్‌ విటాలో 32 మంది, నేషనల్‌ క్వాలిఫైయర్‌ టెస్ట్‌ పరీక్ష పరీక్షయందు 51 మంది విద్యార్థులు ఉద్యోగ నియమకాలు పొందారని తెలిపారు. వార్షిక వేతనం రూ.3.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు సంస్ధ కేటాయించినట్లు  పేర్కొన్నారు. 60 శాతం విద్యార్థుల విద్యాసంవత్సర ప్రారంభంలోనే నియామక పత్రాలు పొందటం విశేషమన్నారు. ప్రతి విద్యార్థికి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా వీవీఐటీ కృషి చేస్తోందని ఆయన తెలిపారు. అనంతరం ఎంపికైన విద్యార్థులను చైర్మన్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వై.మల్లిఖార్జునరెడ్డి, ఉపాధి, శిక్షణాధికారి కె.సురేష్‌బాబు, అధ్యాపకులు అభినందించారు.

Updated Date - 2020-12-29T05:56:22+05:30 IST