ఇసుక లారీ ఢీకొని వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2020-12-28T05:43:22+05:30 IST

సైకిల్‌పై వెళుతున్న వృద్ధుడిని లారీఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందిన ఘటన కొలకలూరు గ్రామంలో జరిగింది.

ఇసుక లారీ ఢీకొని వృద్ధుడి మృతి

తెనాలి రూరల్‌, డిసెంబరు 27: సైకిల్‌పై వెళుతున్న వృద్ధుడిని లారీఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందిన ఘటన కొలకలూరు గ్రామంలో జరిగింది. ఎస్‌ఐ మన్నెం మురళి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని కొలకలూరుకు చెందిన ఉన్నం ప్రభాకర్‌రావు(71) ఆదివారం గ్రామంలోని ప్రధాన రహదారి వెంట సైకిల్‌పై వెళుతున్నాడు. నందివెలుగు నుంచి వస్తున్న ఇసుకలారీ వేగంగా వచ్చి సైకిల్‌ను ఢీ కొట్టింది. దీంతో సైకిల్‌పై వెళుతున్న ప్రభాకర్‌ గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి జిల్లా ప్రభుత్వవైద్యశాలకు తరలించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మన్నెం మురళి తెలిపారు.


Updated Date - 2020-12-28T05:43:22+05:30 IST