ఓటు సరిచూసుకోండి..
ABN , First Publish Date - 2020-12-13T05:40:41+05:30 IST
జిల్లాలోని అన్ని పోలింగ్ కేం ద్రాల వద్ద ఆదివారం కూడా ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి.

గుంటూరు, డిసెం బరు 12 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలోని అన్ని పోలింగ్ కేం ద్రాల వద్ద ఆదివారం కూడా ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి. శనివారం బూత్‌స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ముసాయిదా ఓటరు జాబితాలు, క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు సంబంధించిన ఫా రంలతో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటర్లకు అందుబాటులో ఉండి దర ఖాస్తులు స్వీకరించారు. తమ వద్దకు వచ్చిన వా రికి ఓటరు జాబితాలను అందజేసి అందులో పేరుందో, లేదో చూసుకొనే అవకాశం కల్పించారు. అలానే కొత్తగా ముద్రణ జరిగి వచ్చిన ఎపిక్ కార్డులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు దా ఖలైన క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు సంబంధించి క్షేత్రస్థాయి విచారణ ప్రారంభించారు. ఎవరైతే క్లెయిమ్‌లు పెట్టుకొన్నారో వారికి ఫోన్లు చేసి సం బంధిత ధ్రువీకరణ పత్రాలపై సంతకం చేసి అందజేయాల్సిందిగా సూచించారు. కాగా పోలింగ్ బూత్‌ల వద్దకు పెద్దగా ఓటర్లు రాలేదని బీఎల్‌వోలు తెలిపారు. ఆదివారం కూడా తాము ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గం టల వరకు అందుబాటులో ఉంటామని, ఓటర్లు తమ పేర్లు ఓటరు జాబితాల్లో ఉన్నాయో, లేదో చూసుకొనేందుకు సమయం కేటాయించి రావా లని సూచించారు. కాగా టీడీపీ నాయకులు మా త్రం పలు గ్రామాలు, డివిజన్లలో ఓటరు సహాయ కేంద్రాలు ఏర్పాటుచేసి ఓట్లు జాబితా లో ఉన్నాయో, లేదో చూసి సహకరించారు. అలా నే ఓటరు నమోదు కోసం వచ్చిన వారితో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయించారు.